సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. కట్నకానుకలు వంటి మొత్తం తతంగం మాట్లాడుకున్నారు. వివాహ నిశ్చితార్ధం సందర్భంగా ఆడపెళ్లి వారి ఇంట భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల్లో మాంసాహారం వడ్డించారు. ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దదై చివరికి పోలీస్‌స్టేషన్ వరకు వీరి పంచాయితీ వెళ్లింది. పోలీసులు ఇరువర్గాలు శాంతించినప్పటికీ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది....
-----------------------
Admin