సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో అత్యాధునిక వైద్య పరికరాలతో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న ఏకైక ఆసుపత్రి ఏబివి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు..శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఎబివి మల్టీ స్పెషాలిటీ డైరెక్టర్&సిఈఓ డా.ఆనంద్, డా.భార్గవి అధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. షాద్ నగర్ పట్టణంలో అతి తక్కువ కాలంలో షాద్ నగర్ ప్రజల మన్ననలు పొందిన ఏకైక ఆసుపత్రి ఏబివి అని, ప్రజలకు నమ్మకంతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలను అభినందించారు. అతి తక్కువ టైమ్ లో షాద్ నగర్ లో ఇంత గొప్పగా పేరు సంధించడం గొప్ప విషయమని అన్నారు. ముందు ముందు ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ప్రజల సహకారం తోనే ఇంత గొప్ప పేరు. ఏవివి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రజల సహకారం తోనే ఇంత గొప్ప పేరు లభించిందని ఎబివీ ఆసుపత్రి డైరెక్టర్&సిఈఓ డా.ఆనంద్,డా. భార్గవి అన్నారు. షాద్ నగర్ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలతో అందుబాటులో సరైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఏబీవీ ఆసుపత్రి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఎన్నో అరుదైన చికిత్సలు, అత్యవసర విభాగాలలో వైద్య సేవలు అందించి ఎంతోమందికి అండగా నిలిచామని, తమకు అండగా నిలిచిన షాద్ నగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందిని సన్మానించి మెమెంటో లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ ప్రతాప్ రెడ్డి(చింటూ), సర్పంచ్ మోబిన్ గౌరీ, నాయకులు పిల్లి శేఖర్, జూపల్లి శంకర్, తాండ్ర శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin