Monday, 27 July 2026 04:31:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రధమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ డిజిటల్ మేళా విద్యార్థులకు కంప్యూటర్ పై అవగాహన సదస్సు...

Date : 20 February 2024 10:55 AM Views : 308

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలంలో గల బాలికల పాఠశాలలో, ప్రధమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్, సాప్ మరియు ఐటీసీ సహకారంతో డిజిటల్ మేళా నిర్వహించారు... ప్రభుత్వానికి సంబంధించిన 20 పాఠశాలల లో గల విద్యార్థులకు వారు నేర్చుకున్న కంప్యూటర్ విద్యపై డిజిటల్ ఎడ్యుకేషన్ మేళా నుండి నమూనాలు తయారు చేయించారు. డిజిటల్ మేళాలో 6వ తరగతి విద్యార్థినిలకు సోషల్ మీడియాపై, మరియు 7వ తరగతి విద్యార్థినిలకు మేడిన్ ఇండియా ఎమ్మెస్ ఎక్స్ఎల్ సైబర్ సెక్యూరిటీ పై పవర్ పాయింట్లలో, అదేవిధంగా 8వ తరగతి విద్యార్థినులకు స్క్రాచ్ లో మిషన్ చంద్రయాన్ -3,యానిమేషన్, అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులకు కెరియర్ ఇన్ ఐటీ హెచ్ టి ఎం ఎల్ లలో వెబ్ పేజ్ క్రియేషన్ పై అవగాహన కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గూగుల్ మ్యాప్స్ పై అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించిన పలువురు ఉపాధ్యాయులు జి. లోకరాజు , ఆర్.నవీన్,బి. కొండరావు, జి.సాయి లక్ష్మి, పి. కళ్యాణి , పాల్గొన్నారు. విద్యార్థినిలకు కంప్యూటర్లో గల అనేక విషయాలపై ఉపాధ్యాయులు అత్యంత శ్రద్ధ కనబరచి వారికి అర్థమయ్యే విధంగా విద్యార్థులకు వాటిపై సరియైన అవగాహన కలిగించే విధంగాఉపాధ్యాయలు విద్యార్థులపై వారి ప్రేమను కనబరిచారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :