సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని, రామస్వామి గుట్టు రోడ్డులో ఈ నెల 31న జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వద భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరిన మన హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో హుజుర్ నగర్ కి రానున్న నేపథ్యంలో సభావేదిక ను పరిశీలించి, సభా ప్రాంగణం ఏర్పాట్లను హెలిప్యాడ్ పనులను , పరిశీలించారు.సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ దళం లక్షల సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యం లో ఎవరికీ యే ఇబ్బంది కలగకుండా సీఎం సభ కోసం అన్నీ ఏర్పాట్లు దగ్గరుండి సిద్ధం చేయించారు. మన హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగే సీఎం కేసీఆర్ గారి భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు ప్రతి ఒక్కరు పెద్డ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి తదనంతరం మీడియా విలేకరులతో, హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం సభ కోసం, నియోజక వర్గం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు, రేపు సభ లో సీఎం కేసీఆర్ స్పీచ్ వినాలని ఆసక్తి తో, ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఊరు,ప్రతి గ్రామం నుండి వందలాదిమంది, వేలాదిమంది తరలివస్తానికి సిద్ధంగా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షమంది ప్రజలు హాజరై అవకాశం ఉంది..కాబట్టి ప్రజలు ప్రశాంతంగా సీఎం కేసీఆర్ మీటింగ్ చూసుకుని,స్పీచ్ వినే విదంగా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, మంచినీళ్లు, ట్రాఫిక్ సమస్యలు,ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించనున్నాము. ఇంకా చేయనున్న పనులను,మ్యానిఫెస్టోను కూడా తెలియజేయడం జరుగుతుంది.అన్నారు. 2019-ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత పెట్టిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభలో సీఎం కెసిఅర్ గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి మాటను నిలబెట్టుకున్నారు..100 కు 99 % అన్ని పనులు పూర్తి స్థాయిలో అమలు చేయడం జరిగింది. ఈ నాలుగు ఏండ్లలో సుమారు రూ.4000 కోట్ల నిధులతో హుజూర్ నగర్ నియోకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసి చూపించాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకకున్నాము. హుజూర్ నగర్ లో అన్ని రహదారుల నిర్మాణం పూర్తి చేయించాం.. ప్రతి గ్రామంలో ప్రతి బజారుకు సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశాము.అన్ని గ్రామాలకు నూతన లింకు రోడ్లు నిర్మించాం.హుజూర్ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతుంటే చూసి తట్టుకోలేక, కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో కావాలని అడ్డుకున్నారు.ఎన్నికల కోసం ఓట్ల రాజకీయం చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి తెలుసు, అతను చేయని పనులను, కూడా అతనే చేశానని ప్రజలకు అబద్ధాలు చెప్పి ఉత్తమ్ దిగజారుడు నాయకుడిలా ప్రవర్తిస్తున్నాడు, తలకిందులుగా తపస్సు చేసినా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని నమ్మే పరిస్థితిలో లేరు, ఓటమి భయంతోనే ఉత్తమ్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడు, ఇప్పుడు హుజుర్ నగర్ గడ్డ -బీఆర్ఎస్ అడ్డ హుజుర్ నగర్ లో ఉత్తమ్ గెలవడం కష్టమే,ఆ విషయం ఆయనకు కూడా తెలుసు..నియోజకవర్గ అభివృద్ధి ,ప్రజల సంక్షేమం కోసం నేను కృషి చేస్తున్న.తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ఉద్యమ పార్టీ తెచ్చిన తెలంగాణ ను అభివృద్ధి చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.అర్ధరాత్రి ఫోన్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉన్న ఆదుకున్నాను.ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత అభివృద్ధి ఎంత జరిగిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గా ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలి అన్నారు.నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు, ప్రజలు,ప్రతి ఒక్కరూ ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు వివిధ మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు,కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin