సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారి 167 ప్రక్కన ఆర్డిఓ కార్యాలయం ముందర నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ ప్రజా మరుగుదొడ్లు నిర్మించిన దగ్గర నుంచి సంబంధిత మున్సిపల్ శాఖల అధికారులు పట్టించుకోక పోవడం వలన ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి సులబ్ కాంప్లెక్స్ ముందర మలమూత్రాలు విసర్జించి దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని సులబ్ కాంప్లెక్స్ కు తాళాలు వేసి ఉంచటం వలన ప్రతిరోజు హుజూర్ నగర్ పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చి పోయే ప్రజలు వాహనదారులు రోగులు మలమూత్ర విసర్జనకు సౌకర్యం లేక అనేక బాధలు పడుతున్నారని ముఖ్యంగా స్త్రీలు వృద్ధులు దివ్యాంగులు పడుతున్న బాధలు చెప్పనలవి కానివనీ హుజూర్ నగర్ పట్టణంలో తహసిల్దార్ కార్యాలయం ముందర కొత్త బస్టాండ్ లోపల నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు 24 గంటలు తెరిచి ఉంచకపోవడం వలన రాత్రిళ్ళు తాళాలు వేసి వెళ్లిపోవడం వలన దూర ప్రాంతాల నుంచి హుజూర్ నగర్ కు వచ్చే పోయే ప్రయాణికులు ప్రజలు మలమూత్రాలు విసర్జించే సౌకర్యం లేక ఎవరికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారని ఇట్టి ప్రధాన ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ తీసుకొని వెళ్ళినారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు బాధలు పడకుండా తక్షణమే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుని ప్రజలు ప్రయాణికులు రోగులు మలమూత్రాల విసర్జన కొరకు నిర్మించి ఉన్న సులబ్ కాంప్లెక్స్ లు నీటి వసతితో పరిశుభ్రంగా 24 గంటలు తెరిచి ఉంచే విధంగా సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హుజూర్నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు ని కోరి వినతిపత్రం అందించినారు ఇట్టి కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ జై గౌడ సంఘం అధ్యక్షులు సోమ గాని నరసింహ గౌడ్ పాల్గొన్నారు....
-----------------------
Admin