సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ర్యాలీగా బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సోనియాగాంధీ గారికి రుణపడి ఉంటామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ చిరుమరి కృష్ణయ్య గారు, రాష్ట్ర నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ గారు, మహబూబ్ అలీ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి గారు ,నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకోప్పుల సైదులు, పొదిలి శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సలీం, ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు హరిఫ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజారుద్దీన్, కౌన్సిలర్లు, ఇన్చార్జిలు, మహిళా కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షురాలు వింజమూరు లలిత ,కౌన్సిలర్లు కొమ్మర నాగలక్ష్మి, అనిత ,గంధం రామకృష్ణ ,శేఖర్ రెడ్డి ,కొమ్ము శ్రీనివాస్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin