సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గత 50 ఏళ్లుగా పేపర్ బాయ్ పనిచేస్తున్న డి పున్నంచంద్ ను స్థానికులు సన్మానించారు. వేకువజామున లేచి పేపర్ పంచుతూ ప్రజల మన్ననలు పొందుతూ తన కర్తవ్యం గా సేవలందిస్తు సూర్యోదయానికి ముందే పేపర్ బాయ్స్ గుమ్ము ముందుకు పేపర్ తీసుకువస్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పేపర్స్ బాయ్స్ డే ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వాలు పత్రికా యాజమాన్యాలు పేపర్ బాయ్స్ ని గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేసుపాక నరసింహారావు, పాల్వాయి అనిల్, పుట్టి ప్రసాద్, కన్నబోయిన సతీష్, డాక్టర్ మహేష్, రవిచంద్ర, గోనెల సతీష్ కుమార్, (మనం రిపోర్టర్) కన్నబోయిన నరేష్, గోనెల రవి, కన్నబోయిన సారధి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin