సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ... ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో తెలుగువారు పడుతున్న ఇబ్బందులు తమిళుల నుండి వారు ఎదుర్కొంటున్న అవమానాలను వివక్షతను స్వయంగా చూసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా 1952 అక్టోబర్ 19 నాడు మద్రాసులోని బలుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్షకు పూనినారు, సుమారు 56 రోజుల అనంతరం డిసెంబర్ 15న 1952 రోజున అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు అమరుడైనారు. ఈ విధంగా పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ ధ్యేయంగా తన తుది శ్వాస విడిచారు. ఆయన మరణాంతర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అని అదరపు ఎస్పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తో పాటు ఏవో సుజాత , అడ్మిన్ ఆర్ ఐ టైటాస్ , డిసిఆర్బి సిఐ గంటా సుబ్బారావు , ఇతర ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-----------------------
Admin