Monday, 27 July 2026 04:12:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెంలో సింగరేణి వీధి కుళాయిలు పునరుద్ధరించాలి...

Date : 02 July 2023 05:23 AM Views : 497

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: కొత్తగూడెం వ్యాప్తంగా వీధి కుళాయిలు సింగరేణి యాజమాన్యం పునరుద్ధరించాలని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.శనివారం ఆయన స్థానిక సింగరేణి హెడ్డాఫీస్ ఎదురుగా పార్టీ శ్రేణులతో కలిసి కళ్లకుగంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిన్నెరసాని మంచినీటి పథకాన్ని ప్రారంభించక ముందు కొత్తగూడెం పట్టణంలో సింగరేణి యాజమాన్యం వీధి కుళాయిలను ఏర్పాటు చేసి కార్మిక,కార్మికేతర ప్రాంతాలలో మంచినీటిని సరఫరా చేసేదని గుర్తు చేశారు.కొత్తగూడెం పట్టణంలో మార్చి నుంచి ఇప్పటివరకు నెలలో 10 రోజులు కూడా కిన్నెరసాని మంచినీరు సక్రమంగా సరఫరా జరగడం లేదని,నిత్యం ప్రజలు మంచినీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కిన్నెరసాని పైప్ లైన్ పూర్తిగా పాడైపోయి ఎన్ని మరమ్మతులు చేసినా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది తప్ప నీటి సరఫరా మాత్రం జరగడం లేదని ఆరోపించారు.మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ప్రజలకు రెండు వాటర్ ట్యాంకులతో నీటిని పంపిణీ చేస్తున్నారని,ఈ రెండు వాటర్ ట్యాంకుల ద్వారా మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో నీటి సరఫరా చేయడం కష్టతరమవుతుందని తెలిపారు.సింగరేణి కార్మిక ప్రాంతమైన కొత్తగూడెంలో ప్రజలు మంచినీటి కోసం అగచాట్లు పడుతున్నారని అన్నారు.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధుల కింద కొత్తగూడెం ప్రజలకు మంచినీటి సరఫరా చేసే బాధ్యతను సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణి యాజమాన్యం సిఎస్ఆర్ నిధులను కొత్తగూడెం ప్రాంతంలో కాకుండా గజ్వేల్,సిద్దిపేట,సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో ఖర్చు చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.హైదరాబాద్ లో సీసీ కెమెరాల కోసం సిఎస్ఆర్ నిధులను సింగరేణి యాజమాన్యం ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ దఫా సిఎస్ఆర్ నిధులతో వీధి కుళాయిలు,మున్సిపాలిటీ లో వార్డుకు ఒక వాటర్ ట్యాంక్ ను యాజమాన్యం అందించాలని అన్నారు.ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి కార్మిక,కార్మికేతర ప్రాంతాలలో సిఎస్ఆర్ నిధులతో మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శులు మాలోత్ వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,జర్పుల కళ్యాణ్,మాలోత్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :