సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / బిజెపి పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ పంటల కనీస మద్దతు ధర కల్పించిన సందర్భంగా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో గల మార్కెట్ యార్డులో మోడీ ఫోటోకు పాలాభిషేకము కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ టంగూటురి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు మోడీ ప్రధాన మంత్రి కిసాన్ యోజన ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు రూపంలో సహాయం చేయడమే కాక మరింతగా లబ్ది చేకూర్చే విధంగా పంటల కనీస మద్దతు ధరను పెంచడం హర్షదాయకం అని అలాగే రైతుల రుణాలను మాఫీ చేయకుండా మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వంకి వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు, సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, అన్ని పంటల కనీస మద్దతు ధరలను ఇంత భారీ మొత్తంలో పెంచడం సర్వర్తర హర్శంవెక్తం చేస్తున్నారు. అనిరైతుల వ్యవసాయ ప్రక్రియను లాభం చేకూర్చే విధంగా డా.స్వామినాధన్ కమిషన్ చెప్పిన అనేక ప్రతిపాదనలు రైతుల శ్రేయస్సుకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం తీసుకుని వాటిలో బాగానే పంటల కనీస మద్దతు ధరను ఇంత భారీగా పెంచి రైతులకు మరింతగా మేలు చేకూర్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు అని అన్నారు. అలాగే కెసిఆర్ రైతులకు ప్రతి ఏటా బోనస్లు ప్రకటించి అట్టకేకించరు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భూపాలచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్యా, కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శ్యామ్ సుందర్, ఓ బి సి మోర్చా నాయకులు మాల్చాలం మురళి, బిజేవైఎం నాయకులు వంశికృష్ణ, వివిధ మండల అధ్యక్షులు కూర్మయ్య, సుధాకరప్ప, నర్సింహ యాదవ్, ఆకుల ప్రదీప్, శ్యామ్ సుందర్ రెడ్డి, రైతులు పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin