సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రానికి సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బిఎస్ఎఫ్ జవాన్ సోమశేఖర్ రెడ్డి అంత్యక్రియలు వేమారెడ్డి పల్లి వద్ద పోలీసు గౌరవ లాంచనాలతో జరిగాయి. చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కు తొలి వీడ్కోలు పలికేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి , సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో ఓబుల దేవర చెరువు ఎస్ఐ గోపికృష్ణ స్వయంగా సోమశేఖర్ రెడ్డి పాడేమోసి కన్నీటి వీడ్కోలు పలికారు...
-----------------------
Admin