Monday, 27 July 2026 06:34:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నల్గొండ జిల్లా కేంద్రంలో ఫ్రెంట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఎన్నిక...

Date : 01 November 2024 02:54 AM Views : 496

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రెస్ క్లబ్ నల్లగొండ సర్వసభ్య సమావేశంలో ప్రెస్ క్లబ్ అంటే జర్నలిస్టుల ఔన్నత్యాన్ని కాపాడడంతో పాటు బాధిత ప్రజలకు అండగా నిలవాలని సీనియర్ జర్నలిస్టులు గార్లపాటి కృష్ణారెడ్డి, చింతకింది గణేష్ అభిప్రాయపడ్డారు. ప్రధాన మీడియా, చిన్న పేపర్లు, డెస్క్ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులు అనే వ్యత్యాసం లేకుండా అందరికీ ప్రెస్ క్లబ్ అండగా నిలవాలనీ వారు సూచించారు. ప్రస్తుత మీడియా అకాడమీ చైర్మన్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వంతో సంప్రదిస్తున్నారని వారు తెలిపారు. అనంతరం నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. తమ పట్ల విశ్వాసం ఉంచి నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి సహచర జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులందరికి సమన్యాయం అందిస్తామని, జిల్లా కేంద్రం లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ మీడియా అకాడమీ సహకారంతో జర్నలిస్టులకు లబ్ధి చేకూర్చేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తామని ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. బాధితులకు అండగా నిలుస్తూ ప్రెస్ క్లబ్ ఔన్నత్యాన్ని కాపాడడంతోపాటు జర్నలిస్టుల ఐక్యత ను చాటే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :