సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొన్ని మీడియా సంస్థలు మరికొన్ని యూట్యూబ్ చానల్స్ లలో బిజెపిపై వ్యతిరేక ప్రచారం కొనసాగిస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. సిటీటైమ్స్ ప్రతినిధి ఈటల రాజేందర్ ను ప్రశ్నిస్తూ పార్టీలో కాంగ్రెస్ సంస్కృతి కనిపిస్తుందని పార్టీలో బండి సంజయ్ పరిణామం తర్వాత వ్యతిరేక స్వరాలు పెరిగాయని పార్టీ ప్రతిష్ట తగ్గుతోందని ప్రశ్నించగా దీనికి సమాధానంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఇది కలియుగమని స్పందించారు. కలియుగ ప్రభావంతో తమ పార్టీలో కూడా ఇలాంటి సంస్కృతి వచ్చిందేమో? అని చమత్కరించారు. క్రమశిక్షణకు మారుపేరు భారతీయ జనతా పార్టీ అని ప్రతి పార్టీలో కూడా కొంత వ్యతిరేకత సర్వసాధారణమని అన్నారు. అన్ని పార్టీలో ఉన్నట్టు మా పార్టీకి కూడా కొంత కలియుగ ప్రభావం ఉందని చెప్పుకొచ్చారు. పార్టీలో ఇలాంటి అంతర్గత యుద్ధాలు గాని విభేదాలు గాని లేవని అందరితో కలిసి పనిచేస్తూ కార్యకర్తల విశ్వాసాన్ని చురగొంటున్నామని అన్నారు. కొన్ని చానల్స్ లలో మరికొన్ని యూట్యూబ్స్ లలో భారతీయ జనతా పార్టీపై దుష్ప్రచారం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తూ లేనిపోని గందరగోళ పరిస్థితులు ఏర్పడేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. అంతే తప్ప పార్టీ సజావుగానే ముందుకు సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో కూడా అదే క్రమశిక్షణతో ఎన్నికల్లో పాల్గొంటామని అన్నారు. అఖండ భారతదేశం మనది. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ భారతదేశం అఖండ భారతావని అని కీర్తించారు. ఇక్కడ వర్గ విభేదాలు వైశమ్యాలు లాంటి వాటికి తావు లేదని అన్నారు. మణిపూర్ సంఘటన అత్యంత బాధాకరమని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దేశంలో మంచి సుపరిపాలన అందుతుందని అన్నారు. మణిపూర్ లాంటి సంఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కొంతమంది వైశమ్యాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజల్లో జీవన సంస్కృతి, విభిన్న జాతుల విధి విధానాలు ఎవరివి వారికి ఉన్నాయని అన్ని సంస్కృతులను ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి సంఘటనలను రాజకీయంగా వాడుకుంటున్నారని అంతేతప్ప భారతీయ జనతా పార్టీకి ప్రమేయం ఏమీ ఉండదని అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల విశ్వాసాన్ని చురగొంటుందని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, షాద్ నగర్ నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ టి విజయ్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు కమ్మరి భూపాల చారి, శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, కక్కునూరు వెంకటేష్ గుప్తా, డాక్టర్ ప్రణీత్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, వంశీ, అశోక్, మనోహర్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్, చెట్ల వెంకటేష్, ఆకుల ప్రదీప్, మఠం రిషికేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin