Sunday, 26 July 2026 02:11:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె మట్టయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి కి ఘన స్వాగతం...

Date : 02 September 2023 06:10 AM Views : 288

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె మట్టయ్య ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ మన్నెం శ్రీనివాసరెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షలు ఇరుగు పిచ్చయ్య, ల సహకారంతో భారీ బైక్ ర్యాలీ తో శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి కి ఘన స్వాగతం పలికిన మండల, పలు గ్రామాల దళిత జాతి నాయకులు. మండల కేంద్రం లో భారీగా కొనసాగిన ఎస్సీ సెల్ బైక్ ర్యాలీ లో ,యువకులు.నాయకులు ఉత్సహం తో జై సైదన్న నినాదాలతో మఠంపల్లి సెంటర్ లో ఎమ్మెల్యే సైదిరెడ్డికి గజమాల, శాలువతో సన్మానించారు. అనంతరం శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మఠంపల్లి సెంటర్లో ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి,జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబెడ్కర్ ఆశయాల అమలులో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బారి ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దళిత గిరిజన ,బడుగు బలహీన నిరుపేద వర్గాల అభ్యున్నతికి నిరంతరం సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా సమాజంలో పేర్కొని పోయిన కుల వ్యవస్థ మరియు ఆర్ధిక హెచ్చుతగ్గులు రూపుమాపడానికి ఆర్థిక స్వలంబనతో సమాజంలో వ్యక్తుల మధ్య కులాల మధ్య కుటుంబాల మధ్య సమతుల్యతను సాధించడం కోసం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు ,బీసీ బందు, మైనారిటీ బందులు ఎంతగానో ఆయా వర్గాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయని , ఇందుకు కారణం కేవలం ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సుదీర్ఘమైనటువంటి అవగాహన మాత్రమేనని ఈ సందర్భంగా తెలియజేశారు.మరి హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించినట్లాతే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం ఓట్లు దండు కోవడం ,తర్వాత దోచుకోవడం అనే విధానాలను మాత్రమే పాటించయని అందుకు నిదర్శనం మన హుజూర్నగర్ నియోజకవర్గం అని ,గతంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోక దుర్భరమైన పరిస్థితిలో ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గం నేడు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మూడున్నర సంవత్సరాలలో పెద్ద పెద్ద పట్టణాలతో పోటీ పడుతున్న మన గ్రామాలను ఉదాహరణగా చూపించుకోవచ్చు ,హుజూర్నగర్ లో నెలకొని ఉన్న ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, గురుకులాలు ,మౌలిక సదుపాయాలు ,ప్రతి గ్రామంలో సి.సి రోడ్లు లేని వీధి అంటూ లేకపోవడం, అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అర్హులైన ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి చేయూతనిస్తున్న మన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన మద్దతును తెలియజేస్తూ మరి మన భవిష్యత్తు తరాల అభివృద్ధి కొరకై మళ్లీ కారు గుర్తు కే ఓటేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంత చక్కటి బైక్ ర్యాలీ మరియు కార్యక్రమాన్ని నిర్వహించిన మఠంపల్లి దళిత సెల్ కమిటీకి నాయకులకు యువకులకు, పేరు పేరునా నమస్కారాలు మరియు ధన్యవాదాలు శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ నాయక్, సెల్వాది సీతారామయ్య, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నరేందర్ ,ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, సర్పంచ్ గుండెపంగు కృష్ణవేణి నరేష్, సర్పంచ్ సుదర్శన్, మండల యువ నాయకులు అయ్యప్ప, ఎంపీటీసీ సైదా కుమారి కాశయ్య,ఉప సర్పంచ్ రాజీవ్, చట్లా రామ కృష్ణ ,వార్డు సభ్యులు, దేవ బిక్షం,నాగరాజు,నాగులు, గ్రామ శాఖ అధ్యక్షులు చిలక సతీష్, బత్తుల సైదయ్య, అరాల నాగరాజు, మట్ట య్య, అంబేద్కర్ యువజన అధ్యక్షులు కొమ్ము సైదులు,దైద ఇమ్మానియేలు, శ్రీను , సురేష్, సుధాకర్,ఆకారపు హుస్సేన్, ప్రభు, గోపి, యేసు, నూతన్ బాబు, నాగ బాబు, కే. ఇమ్మానియేల్, రమేష్,మహేష్,గణేష్, సైదులు, పాప య్య, పెద యేసు, సోషల్ మీడియా సభ్యులు బేత శివారెడ్డి, పల్లె సుధాకర్, అధాo, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: