Monday, 27 July 2026 05:21:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాలమూరు లో నరేంద్ర మోడీ ప్రజా గర్జన సభను విజయవంతం చేయండి... - బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి.

Date : 29 September 2023 05:52 AM Views : 247

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అక్టోబర్ 1 న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరగబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలమూరు ప్రజాగర్జన సభకు భారీగా తరిలి రావాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. షాద్ నగర్ నియోజకవర్గం చౌదరి గూడ మండలం లచ్చంపేట గ్రామంలో నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజలను సభకు ఆహ్వానించారు. వారితో పాటు బోయ కురుమయ్య, సురేష్, యాదయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 9 సంవత్సరాలుగా దేశంలో అవినీతిరహిత పాలనను అందిస్తూ, చరిత్రత్మాకమైన మహిళా బిల్లును ప్రవేశపెట్టి, చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి, మొట్ట మొదటి సరిగా తెలంగాణా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా)కు వస్తున్నారని అన్నారు. ప్రజలందరూ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాలో జరగబోయే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభకు వేలాది గా తరలి వెళ్లి విజయవంతం చేయాలని, గ్రామ ప్రజలను ఇంటింటికి వెళ్లి ఆహ్వానించారు. కేసీఅర్ తెలంగాణా పాలమూరు ప్రజలను మోసం చేశారనీ అన్నారు. అనేక సభల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ ను నిర్మించి జిల్లా లోని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న కెసిఆర్ ఒక్క ఎకరానికైనా ఇచ్చారా? ప్రజలు ఆలోచించాలని అన్నారు. మరియు ప్రాణహిత చేవెళ్ల ద్వారా కృష్ణాజలాల నీరు ఇస్తామని, ఆ రిజర్వాయర్ కు కూడా రూపురేఖలు లేకుండా చేసారని అన్నారు. మహబూబ్ నగర్ కు మోడీ ఎందుకొస్తున్నారని అంటున్న కేటీఆర్ మరి మీరు పాలమూరుకు ఏం అభివృద్ధి చేసారో స్పష్టం చేయాలని అన్నారు. మోడీ పాలమూరు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్నారని, మీరు చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి వస్తున్నారని అన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులు బలై పోవడానికి పేపర్ లీకేజీ లో కేటీఆర్ పాత్ర లేదా? అని అన్నారు. నిరుద్యోగులను, రైతులను, ప్రజలను, దళితులను, బీసీ లను, గిరిజనులను మరియు రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజలను కెసిఆర్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. కాబట్టి మళ్ళీ ఎన్నికలొస్తున్నాయి కెసిఆర్ ప్రభుత్వం ఇంకా ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్, అంజయ్య, శ్రీనివాస్, మల్లేష్, సురేష్, శివ కుమార్, నవీన్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: