సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్, ఆర్మూర్ మండలం, ఆలూర్ మండలం నందిపేట్ మండలం, డొంకేశ్వర్ మండలం మరియ మాక్లూర్ మండలాల్లో అతి భారీ వర్షాల వల్ల వెల్లువెత్తిన వరద ప్రాంతాలను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డులో వరద ఉధృతిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేయాలన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇస్సపల్లి గ్రామంలో, ఆలూరు మండల కేంద్రంలో చెరువుల వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో భారీ వర్షాల వల్ల చిత్తడిగా మారిన రోడ్ల వెంట ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విష జ్వరాలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ ను చల్లారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి, మంథని గ్రామాల మధ్య వాగు ప్రవాహం వల్ల తెగిపోయిన రోడ్డును పరిశీలించి త్వరితగతంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నందిపేట్ పట్టణంలో, నందిపేట్ మండలంలోని కుద్యన్పూర్ నుండి తొండకూర్ రోడ్ పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలు స్తంభించడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడికి వెళ్లి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణములోని గుండ్ల చెరువు మరియ మల్లారెడ్డి చెరువు కట్టల మీద ఆయన పర్యటించారు, వర్ష భావం వల్ల ఏర్పడిన నీటి ఉద్రిక్తత ఆయన స్వయంగా పరిశీలించారు,అనంతరం అధికారులకు మరమ్మత్తులు చేయాలని ఆయన ఆదేశించారు, తదుపరి మాక్లూర్ మండలం మణిక్ బండర్ బొర్గం వద్ద తీవ్ర వర్షంతో నీటి ప్రవహంతో నిండిన ఆర్మూర్ నిజామాబాద్ హై వే ని పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పస్క నరసయ్య, వాకిడి సంతోష్ రెడ్డి, మాస్త ప్రభాకర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత, వైస్ చైర్మన్ షేక్ మున్నా, పట్టణ మండలాల అధ్యక్షులు పూజ నరేందర్, అలూరు శ్రీనివాసరెడ్డి, మచ్చర్ల సాగర్, సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin