Sunday, 26 July 2026 02:57:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తుమ్మల ఇంట్లో సమావేశానికి క్యూ కట్టిన జిల్లా అధికారులు...

Date : 27 February 2023 12:27 AM Views : 625

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమాంతరంగా మరో మంత్రి ఉన్నారా..? ప్రస్తుతం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు తుమ్మల రాజకీయం నేర్పుతున్నారా..? అదేమిటి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..! సెలవ రోజున ముఖ్యంగా ఆదివారం పూట చోటు చేసుకున్న ఓ సమీక్ష ఘటన రాజకీయంగా అధికార పార్టీలో తీవ్ర కలకలానికి దారితీసింది. జిల్లావ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలు 6 చెక్కలుగా మారిందా అన్నట్లు కనిపిస్తుంది పరిస్థితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి లోని తన నివాసంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనుల త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు పెండింగ్లో ఉన్న విషయాలను ఇరిగేషన్ సెక్రటరీ రజిత్ కుమార్ కు ఫోన్ ద్వారా తెలిపారు... రజిత్ కుమార్ పెండింగ్ పనుల త్వరగా పూర్తి చేస్తామని తుమ్మల నాగేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అటు భద్రాద్రి ఇటు ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, సురేష్, కృష్ణ లతో మాట్లాడి పెండింగ్ పనులు జూన్ జూలై నెల వరకు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను తుమ్మల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు... ఈ అంశంలో ట్రిస్ట్ ఏమిటంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఏ హోదాలో ఇరిగేషన్ అధికారులు సమీక్ష నిర్వహించారని, జిల్లా వాసుల గుసగుసలు... ప్రస్తుతం ఇటువంటి ప్రజా ప్రతినిధి హోదా లేకున్నా తుమ్మల సమీక్షకు ఇరిగేషన్ అధికారులు హాజరై నిలబడి మరి సమాధానం ఇచ్చారు..? మాజీమంత్రి కూర్చోగా అధికారులు నిలబడిన సీన్లు... టిఆర్ఎస్ కార్యకర్తలకు దడ పుట్టిస్తుంది. రానున్న రోజుల్లో ఎన్ని కుంపట్లు ఎన్ని వర్గాలుగా మారుతదో అని భావన కలుగుతుంది. అధికారులు తుమ్మల పిలిస్తే వెళ్లారా..? లేక రాజధాని నుంచి ఏమైనా ఆదేశాలు అందాయా..? అధికార పార్టీ నేతల్లో నానా ప్రశ్నలు ఎదురవుతున్నాయి . గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉదాంతం అధికార పార్టీలో సరికొత్త రచ్చకు కారణమైతదేమో...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: