సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలోని పాత బస్ డిపో ప్రాంగణంలో బిఎల్ఏ ట్రేడ్ ఫెయిర్ వారి తాజ్ మహల్ ఎగ్జిబిషన్ సందడి నెలకొంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంత కూడా కోలాహలంగా సాగుతోంది. ఈ ఎగ్జిబిషన్‌ను చూడటానికి చిన్నా, పెద్ద అంత తరలివస్తున్నారు. ప్రధాన నగరాల నుంచి వైవిధ్య రకాల వస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. దాదాపు 70కి పైగా స్టాళ్లను పైగా ఏర్పాటు చేశారు. సూది నుంచి అత్యాధునిక వస్తువుల వరకు ఎగ్జిబిషన్ లో దొరకని వస్తువే ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఈ వస్తువులను కొనడానికే కాదు చూడటానికి కూడా అధిక సంఖ్యలో జనం వస్తుంటారని ప్రజలు చూసేందుకు వీలుగా అన్ని రోజుల్లోనూ సాయంత్రం 5 గంటల నుంచి 10గంటల వరకు ఎగ్జిబిషన్‌ను కొనసాగిస్తున్నట్టు వారు తెలిపారు. వివిధ రకాల వస్తువులతో పాటు నోరూరించే ఆహార పదార్థాలు, కాలక్షేపం తాజ్ మహల్ ఎగ్జిబిషన్ అదనపు ఆకర్షణ. కుటుంబంతో పాటు వెళ్లిన వారు ఓ మూడు, నాలుగు గంటలు బాగా ఎంజాయ్ చేసేయొచ్చు. సరికొత్త ప్రోడక్టుల గురించి తెలుసుకొని, నచ్చినవి కొని, ఇష్టంగా తిని.. చివరకు పిల్లలతో కలిసి జైయింట్ వీల్ లాంటి సరదాలు తీర్చుకొని ఆనందంగా ఇంటికి తిరిగి రావచ్చు. తాజ్ మహల్ ఎగ్జిబిషన్లో పిల్లలకు కావాల్సిన ఎంజాయ్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. రకరకాల జాయింట్ వీళ్లలో తిరిగి, జారుడు బల్లలపై ఆడుకొని సరదా తీర్చుకుంటారు. యువతీ యువకులు, పిల్లలు ,పెద్దలు కూడా వీటిపై ఆసక్తి చూపిస్తూ ఎంజాయ్ చేసే అవకాశం విశేషం. సందర్శకులను ఆహ్లాదపరిచేలా ఈ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. దసరా సెలవులు ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులతో పాటుగా చుట్టుపక్కల వారంతా కూడా తాజ్ మహల్ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన సందర్శకులను ఆహ్లాదపరిచేలా ఉంది. ఆగ్రాను తలపించేల కొత్తగూడెంలో ఎగ్జిబిషన్ ఉందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో కార్యక్రమంలో నిర్వాహకులు కొయ్య భాను శివప్రసాద్, నందివాడ గురుగోపినాథ్, పైడి రమణ, యేండ్రెడ్డి శ్రీనివాస్, మేనేజర్ ఏలూరి సాయి కుమార్, ఇంచార్జి షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin