సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం అబ్బుగూడెం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెరుకూరి ప్రసాద్ గుడిమెట్ల రాంబాబు బలగాని వెంకన్న తదితరులు మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ మరియు కొత్తూరు వెంకటేశ్వరరావు సమక్షంలో మచ్చా నాగేశ్వరావు చేతుల మీదుగా బిఆర్ఎస్ పార్టీ ఖండవులు కప్పుకొని బిఆర్ఎస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాకుండా గడపగడపకు బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు .. మండల అధ్యక్షులు.. బోయినపల్లి సుధాకర్, మండల పరిధిలోని శాంతినగర్, అబ్బుగూడెం, భీమునిగూడెం, కొండయిగూడెం, అన్నపురెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం తన ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు అశ్వారావుపేట ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరావు గెలుపే లక్ష్యంగా గడపగడప తిరుగుతూ (బిఆర్ఎస్ మేనిఫెస్టో) కేసీఆర్ భరోసా పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్- బిజెపి మాటలను నమ్మితే మోసపోవటం ఖాయమని హెచ్చరిస్తూ కెసిఆర్ రాష్ట్రానికి శ్రీరామరక్ష అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినవాడిలో మొదటి వాడని, నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేశారని, నియోజకవర్గంలో అత్యధికంగా పోడు భూమి పట్టాలిప్పిచ్చారని, . ఆయనను గెలిపించుకుంటే నియోజకవర్గం- మండలం- గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మెచ్చానాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సున్నం లలిత, బిఆర్ఎస్ నాయకులు జంగాల ఉమామహేశ్వరరావు, చల్లా రాంబాబు, పెద్దగౌండ్ల పుల్లారావు, జవ్వాజి వీరభద్రం అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin