Sunday, 26 July 2026 02:10:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నమస్తే నవనాథపురం" కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి...

Date : 07 July 2023 04:21 AM Views : 429

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ : ఆర్మూర్ గడ్డ అభివృద్ధికి అడ్డా అని... పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. "నమస్తే నవనాథపురం" కార్యక్రమంలో భాగంగా గురువారం జీవన్ రెడ్డి నందిపేట్ లో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి నందిపేట్ మండల కేంద్రంలో పర్యటించిన జీవన్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు , వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, ముఖ్యంగా యువకులుపూలమాలలు, శాలువాలతో జీవన్ రెడ్డిని సన్మానించారు. జీవన్ రెడ్డి నందిపేట్ కలియ తిరుగుతూ ప్రజలను పలకరించారు. ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి మంచీ చెడుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. స్థానికంగా ప్రజలు తన దృష్టికి తెచ్చిన అనేక సమస్యలను ఆయన అక్కడిక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఏమొస్తది అని అవహేళన చేసిన వారికి ఆర్మూర్ నియోజకవర్గ సమగ్రాభివృద్దే సమాధానమన్నారు.అభివృద్ధిని చూడండి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్, పదేళ్లుగా పాలిస్తున్న బీజేపీ ఒక్క రోజన్నా ప్రజలను పట్టించుకుందా?కాంగ్రెస్, బీజేపీ నేతలు సంక్రాంతి గంగిరెద్దులు. ఆ పగటి వేషగాళ్ల మాటలు నమ్మితే ఆగమవుతాం. రాహుల్ గాంధీకి దమ్ముంటే నీ హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి. అని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలకొస్తే ప్రజలు చెప్పులతో కొట్టాలన్నారు. ప్రగతి వెల్లివిరుస్తున్న ఆర్మూర్ నియోజక వర్గం అభివృద్ధి, సంక్షేమానికి అసలు సిసలైన అడ్రస్ గా మారిందన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగులు, రైతుల సంక్షేమం అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ సకల జనుల ఆత్మబంధువు అని, ఆయన చేతికి ఎముక లేదని, ప్రతీ ఒక్కరికి సాయం చేయడం ఆయనకు దేవుడిచ్చిన వరమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.ఇది నందిపేట్ కాదు నా బంధువుల పేట. నేను సకల కులాలు నచ్చిన, మెచ్చిన మీ బిడ్డను. మీ కోసం జీతగాడిలా పనిచేస్తున్నా.ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, దేవతలు. మీ చల్లని ఆశీస్సులతో మళ్లీ గెలుస్తా. మనసున్న మహారాజు కేసీఆర్. ఆయన దేశ ప్రధాని కావాలి. బీఆర్ఎస్ దే హ్యాట్రిక్ విజయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులు, మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారం, కవితక్క మంచి మనసు, మంత్రి కేటీఆర్ మార్గ దర్శకంతోనే ఇంత అభివృద్ధి జరిగింది. నేడు ప్రగతి పరిమళాలు విరజిమ్ముతున్న ఆర్మూర్ నియోజక వర్గాన్ని చూస్తే నాకు ఎనలేని గర్వంగా ఉంది అని జీవన్ రెడ్డి భావోద్రేకానికి గురయ్యారు. "నేను నందిపేట్ కు వచ్చే సమయంలో మార్గమధ్యంలో అశోక్, ప్రశాంత్, సాగర్, ఎర్రోళ్ల పెద ముత్యం తదితర వికలాంగులు నన్ను కలిసి మీరు తిరగాలిసిన పనిలేదు.మన ప్రభుత్వం, మన కేసీఆర్, మీరు పనిచేయడం లేదన్న గాడిద ఎవడు?. మా తల్లి తండ్రుల కన్నా ఎక్కువగా మాకు అండగా నిలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మాకు రూ.4016 చొప్పున పెన్షన్లు ఇస్తున్న బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 5వేల మంది వికలాంగులం మాకుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తామని చెప్పిండ్రు. ఇలా సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతీ ఒక్కరూ కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిని సాధించుకున్నామని, ఇక్కడ ఇప్పటికే 25వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పిందని ఆయన అన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వమే పౌష్టికాహారం అందిస్తున్నదని, మగ పిల్లగాడు పుడితే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే రూ. 13వేల చొప్పున ఇస్తున్న ప్రభుత్వం తల్లీ,పిల్ల సంక్షేమం కోసం 14 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్లు ఇస్తోందని ఆయన తెలిపారు. రూ.14 కోట్లు ఖర్చు చేసి నందిపేట్ లో 3126 ఇండ్లకు ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీళ్లు సరఫరా చేస్తున్నామన్నారు. నందిపేట్ లో రూ.3కోట్ల19 లక్షలు ఖర్చు చేసి 336 మంది ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి ద్వారా, ఒక కోటి 46 లక్షల రూపాయలు ఖర్చు చేసి 158 మందికి షాదీముబారక్ ద్వారా ఒక లక్షా వెయ్యి 116 రూపాయల చొప్పున ఇచ్చి ప్రభుత్వమే పెండ్లిండ్లు జరిపించిందన్నారు. నందిపేట్ లో 2539 మందికి రూ.2016 చొప్పున పెన్షన్లు వస్తున్నాయన్నారు. ఒక్క పెన్షన్ల రూపంలోనే ఇప్పటి వరకు ఒక్క నందిపేట్ కే రూ.50కోట్ల41 లక్షలు వచ్చాయన్నారు. ఈ పెన్షన్ల వల్ల కుటుంబ బంధాలు బలపడ్డాయని, అత్తా కోడళ్ల మధ్య సఖ్యత పెరిగిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ దూదేకుల, వడ్డెర , ఎరుకల, పద్మశాలి, మున్నూరు కాపు, గౌడ, మైనార్టీ, మాల,మాదిగ,వైశ్య, రజక, ఎస్ టీ, యాదవ, కుమ్మరి,మేరు, కురుమ తదితర సామాజిక వర్గాల వారికి ఫంక్షన్ హాళ్లతో పాటు మహిళా సంఘం భవనాలు నిర్మిస్తున్నామన్నారు. నిరుపేదలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేస్తామని, సొంత స్థలం ఉన్న వారు ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షల చొప్పున ఇస్తున్నామని, చేతి వృత్తులవారికి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయమందిస్తున్నామని జీవన్ రెడ్డి వివరించారు. "వైకుంఠ దామాలు నిర్మించాం. బస్తీ,పల్లె దవాఖానాలొచ్చాయి. ఎకరానికి పది వేల చొప్పున 623 మంది రైతులకు రూ.5కోట్ల53 లక్షల రైతు బంధు పెట్టుబడి ఇస్తున్నాం. దళితులకు దళితబంధు వస్తోంది. ఏ కారణం చేతనైన రైతులు మరణిస్తే రైతుబీమా ద్వారా పది రోజుల్లోగా 5లక్షల రూపాయల చొప్పున బీమా సొమ్ము ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే తొమ్మిది మందికి 45లక్షల రూపాయల సొమ్మును రైతు బీమా పథకం కింద అందజేసి ఆ కుటుంబాలకు అండగా నిలిచాం.207 మహిళా సంఘాలకు ఈ రోజే 59 లక్షల41వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేశాం. ఒక కోటి 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి 4 చెరువులు బాగు చేశాం. నందిపేట్ కు బైపాస్ రోడ్డు వేయించా. సెంట్రల్ లైటింగ్, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.12 కోట్ల 70 లక్షలు మంజూరు చేయించా. 24 గొర్రెల యూనిట్ల కోసం రూ.30లక్షలు ఇప్పించా. మనఊరు-మనబడి కింద నందిపేట్ లోని అన్ని పాఠశాలల అభివృద్ధికి ఒక కోటి 10లక్షల రూపాయలు వచ్చాయి. రూ.40 లక్షలు మంజూరు చేయించి 330 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేయించా, అని జీవన్ రెడ్డి వివరించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి లో రాజీపడే ప్రసక్తేలేదని లేదు. అభివృద్ధి, సంక్షేమంలో జెట్ స్పీడ్ తో దూసుకెళుతా. పెండింగ్ పనులన్నీ అతిత్వరలో పూర్తి చేసేలా అధికారులకు బాధ్యతలు అప్పగించాం. మీకోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించండి. కేసీఆరే మూడోసారీ ముఖ్యమంత్రి అవుతారు. మీకోసం జీతగాడిలా పనిచేస్తున్న నన్ను మూడో సారి కూడా గెలిపించండి అని అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నమస్తే నవనాథపురం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, జడ్పీటీసీ ఎర్రం యమునా ముత్యం, సర్పంచు వాణి తిరుపతి, ఎంపీపీ సంతోష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ,నాయకులు చెక్ చెక్ ముత్యం, లింగం, ఉల్లి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ గౌడ్, బాల గంగాధర్, మచ్చర్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: