సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి పాలకీడు నేరేడుచర్ల గరిడేపల్లి మేళ్లచెరువు చింతలపాలెం మండలాలలోని వ్యాపారులు కొందరు దీపావళి బాంబులను తమ ఇష్టానుసారంగా ఒక్క పర్మిషన్ తీసుకొని రెండు మూడు షాపులతో 18 సంవత్సరాలు నిండని బడి బడి ఈడు పిల్లలను సైతం సేల్స్ బాయ్స్ గా చేర్చుకొని తమ ఇష్టానుసారంగా ప్రజలకు అధిక రేట్లకు విక్రయిస్తున్న వైనం కొన్ని కొన్ని మండలాలలో జనసంచారం గల ప్రాంతాలలో ఇండ్ల మధ్యన దీపావళి టపాసులు అధిక సంఖ్యలో పెట్టి అమ్ముతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే అధిక సంఖ్యలో ప్రాణ నష్టం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని కొన్ని చోట్లలో కనీసం వారి పోలీసు వారి సూచనలు సలహాలు కూడా తీసుకోకుండా అధిక ధరకు అమ్ముతున్నారని ఇట్టి విషయంపై డి ఎస్ ఓ హుజూర్ నగర్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారామిరెడ్డి ని వివరణ కోరగా ఇట్టి విషయం తమ దృష్టికి వచ్చినదని అట్టి వ్యాపారులపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
-----------------------
Admin