సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా లో నలభై రెండేళ్ల క్రితం 10 మంది దళితుల హత్య కేసులో ఓ 90 ఏళ్ల వృద్ధుడికి యూపీలోని జిల్లా కోర్టు యావజ్జీవకారాగార శిక్ష విధించింది. దోషి పేరు గంగా దయాళ్! 1981లో యూపీ మణిపురి జిల్లాలోని షికోహాబాద్ సమీపంలోని సాధూపూర్‌లో పది మంది దళితులు దారుణహత్యకు గురయ్యారు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఫిరోజాబాద్ జిల్లా పరిధిలోకి మారింది. ఈ కేసులో 10 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ దశలోనే నిందితల్లో తొమ్మిది మంది చనిపోయారు. 90 ఏళ్ల గంగా దయాళ్ ఒక్కడే జీవించివున్నారు. ఆయనకు యావజ్జీవ జైలు శిక్షఽతో పాటు రూ.55వేల జరిమానా విధించారు. ఈ మొత్తం కట్టకుంటే మరో 13 నెలలు గంగా దయాళ్ జైల్లోనే ఉండాల్సి ఉంటుందని తీర్పులో జడ్జి స్పష్టం చేశారు...
-----------------------
Admin