సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మావాళ్ళ మండల కమిటీ మరియు కొమరం భీమ్ కాలనీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసులకు గృహ జ్యోతి పథకం ద్వారా వెంటనే కరెంటు సౌకర్యం కల్పించి నీళ్లు విద్య వైద్యము సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తేదీ 2/1/2025 గురువారం రోజున కుమురం భీం కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఆదివాసీల చెడి పోయిన బల్బులు పట్టుకొని నిరసన భారీ ర్యాలీ చేపట్టి ఆదివాసీలందరూ కలెక్టర్ గారి కార్యాలయం ముందర నిరసిస్తూ కొంతసేపు బైఠాయించినంక అదిలాబాద్ జాయింట్ కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది మెమోరండమిస్తూ తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వినర్ గోడం గణేష్ వెట్టి మనోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ సమాజంలో ఆదివాసిలుగా మేము పుట్టడం నేరమా అదిలాబాద్ జిల్లా కేంద్రం చుట్టూ కరెంటు కానీ ఆదివాసులకు కరెంటు లేదు రాదు మేం ఏం నేరం చేసినమ్ మాకు ఎందుకు ఈ శిక్ష ఈ సమాజంలో మేము మనుషులం కాదా కొమరం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మానవత దృక్పథంతో స్పందించి ఆలోచించి తక్షణంగా కరెంట్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి తాగునీరు రోడ్డు విద్యా వైద్యం మొదలగు సమస్యలు పరిష్కరించాలని వివరించడం జరిగింది. కాలుని సమస్యల కోసం పలుమార్లు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నమస్కరించిన దండం పెట్టిన కనికరించ పోవడం బాధయిస్తుందని ఇప్పటికైనా మమ్ముల్ని మనుషులుగా గుర్తించి మాకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము గత 11 సంవత్సరాల నుంచి చీకటిలో విషెస్సర్పాలతో తీర్లతో పోరాడుతూ చీకటి వేస్తేనే భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాము మా పిల్లల చదువుల కోసం మా భవిష్యత్తు కోసం ఇప్పుడిప్పుడే అడవిని ఈడిసబెట్టి పట్టణాలకు బతకడానికి వచ్చి పిల్లల భవిష్యత్తు చదువుకోవడానికి వచ్చి రూముకి రాయి కట్టుకోక పొట్ట చేతను పట్టుకొని చీకటిలో ఎలాంటి సౌకర్యము లేకపోయినా ప్రభుత్వ భూమి అయిన కొమరం భీం కాలనీలో నివసిస్తున్నాము కావున మాపై దయతలించి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము మా భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం అదిలాబాద్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు గృహ జ్యోతి పథకం కింద కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించని ఎడల మా ఓపిక నశించి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా మా ఉద్యమాలను తీవ్రతరం చేస్తాము మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాము త్వరలో మా సమస్య పరిష్కరించకపోతే ప్రజాభవన్ హైదరాబాద్కు వేల మంది ఆదివాసులతో వెళ్లి నిరసన తెలుపుతాము కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు మానవత్వంతోని ఆలోచించి అమాయకమైన ఆదివాసులకు గృహ జ్యోతి పథకం ద్వారా కొమురం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలందరికీ కరెంటు సౌకర్యంతో పాటు విద్యా వైద్యం రోడ్డు నీటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గోడం గణేశ్, [తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ ] వేట్టి మనోజ్, తుడుందేబ్బ జీల్లా ప్రదాన కార్యదర్శి గోడం రేణుక, [ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు] సలాం వరుణ్, [విద్యార్థి సంఘం జిల్లాఉపధ్యక్షులు ] ఉయిక ఇంద్ర, [మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు] సోయం లలిత బాయి, [మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు] ఆత్రం గణపతి, [డివిజన్ ఉపాధ్యక్షులు ] ఆత్రం భుజంగరావు, [రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు ] మేశ్రమం తులసిరాం, [ రైతు సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు] వేడ్మ ముకుంద్ రావు, [మావల మండల అధ్యక్షుడు] మేశ్రం కేశవ్ , [అదిలాబాదు రురర్ మండల అధ్యక్షులు] తోడ సాం ప్రకాష్, కుంర గోవింద్ , మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin