Sunday, 26 July 2026 08:13:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో సంబరాలు...

Date : 08 September 2023 04:52 AM Views : 191

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మనుషుల మధ్య ప్రాంతాల మధ్య వైశమ్యాలు సృష్టించి చిచ్చు పెడుతోందని.. ప్రాంతాలను మనుషులను కర్కశంగా విడదీస్తోందని అందుకే అందరిని ఏకం చేసే విధంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జూడో పాదయాత్ర నిర్వహించారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిసి డిక్లరేషన్ సభ కోఆర్డినేటర్ వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నట్లు వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక కేశంపేట చౌరస్తాలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. అదేవిధంగా ర్యాలీతో బయలుదేరి పట్టణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి స్వార్థ ప్రయోజనాలను అడ్డం పెట్టుకుందని ఘాటుగా విమర్శించారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టి భారత్ జూడో మంత్రంతో దేశాన్ని సంఘటితం చేసే విధంగా కార్యక్రమాన్ని సఫలం చేశారని అన్నారు. భారతదేశాన్ని ఏకం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కిందని అన్నారు. రాహుల్ గాంధీ చరిష్మా జీర్ణించుకోలేక కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించిందని చివరకు న్యాయమే గెలిచిందని అన్నారు. దేశవ్యాప్తంగా నేడు ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలకు చేసిన నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భర్తీ చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర విధానాలను ఎండగట్టి పేదల పార్టీగా మళ్లీ పురుడు పోసుకోవడం ఖాయమని శంకర్ అన్నారు. రేపు జరగబోయే సిడబ్ల్యుసి సమావేశాలు, బీసీ డీక్లరేషన్ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ భవితవ్యం గొప్పగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, చెన్నయ్య, చల్ల శ్రీకాంత్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, బాలరాజు గౌడ్, ఎర్రోళ్ల జగన్, సుదర్శన్ జంగ నరసింహ యాదవ్ రాజు, శ్రీధర్ రెడ్డి, నరసింహారెడ్డి, ముబారక్ ఖాన్, సయ్యద్ ఖదీర్, అలీం, భాస్కర్, గంగనముని సత్తయ్య, రాజు నాయక్, రవి నాయక్ తదులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :