సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అక్టోబర్ 20 సూర్యాపేట లోని లక్ష్మి గార్డెన్స్ లో,అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో పిడిఎస్ యూ అర్థ శతాబ్దొత్సవాల సభలను పిడి ఎస్ యూ ప్రస్తుత పూర్వ విద్యార్థులు మేధావులు విద్యావంతులు పాల్గొని జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో పి డి ఎస్ యు వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ రంగారెడ్డి పూర్వ & ప్రస్తుత విద్యార్థులు అడ్వకేట్స్ లింగంపల్లి భద్రయ్య, కుంట్ల ధర్మార్జున్, ముప్పాని కృష్ణారెడ్డి, రాచురి ప్రతాప్, నారబోయిన వెంకట్, ఎస్ కె సుభాని, గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, పిడిఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి, సామా నర్సిరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ నక్సల్స్బరి, శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో 1972 లో ఉస్మానియా యూనివర్సిటీ లో విప్లవ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి నేతృత్వంలో పిడిఎస్ పురుడుపోసుకొని 1974 అక్టోబర్ 11,12 లో జె.సి.ఎస్ ప్రసాద్ నాయకత్వం లో పిడిఎస్ యూ గా ఆర్భవించి నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పిడిఎస్ యూ పూర్వ &ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో అక్టోబర్ 20న ఆదివారం 2 గంటలకు లక్ష్మీ గార్డెన్స్ సూర్యాపేటలో* , 24 న హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియం కేంద్రంలో అర్ధ శతాబ్దోత్సవ సభలను జరుపుతున్నామని ఈ సభలను ప్రజాస్వామికవాదులు పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు.
-----------------------
Admin