సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండల కేంద్రంలో నిరాడంబరుడు నిస్వార్థ సేవకుడు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మరియు మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని ఆయన అన్నారు భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ తన చిన్ననాటి తల్లిదండ్రులను ఎదిరించి కుల వివక్షను అంతమొందించేందుకు పనిచేసిన గొప్ప ఆదర్శమూర్తి అని వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి కూలిపోరాటాలు నిర్వహించి వారిలో చైతన్య నింపిన మహనీయుడని ఆయన అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించినారని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని విస్తరించ చేయడంలో ఆయన కృషి మరువలేనిదని పార్టీ నిర్మించడమే కాక ప్రజాప్రతినిధిగా పార్లమెంటు సభ్యునిగా ఎమ్మెల్యేగా 17 సంవత్సరాలు పనిచేస్తూ పార్లమెంటుకు అసెంబ్లీకి సైకిల్ పై నిరాడంబరంగా వెళ్లిన గొప్ప వ్యక్తి అని అన్నారు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తితే అప్పటి ప్రధాని సుందరయ్య ప్రసంగాన్ని శ్రద్ధతో విని విమర్శలు సరిచేసుకునే ప్రయత్నం చేసేవారని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధన అంటే పాలకుల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిగుంట్ల పాలెం ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్ మండల నాయకులు దిద్దకుంట్ల పురుషోత్తం రెడ్డి, మాతంగి ఏసురత్నం, కొండచిన్నల్లయ్య,రవి, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin