సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోని బురుగడ్డ (మాచవరం) గ్రామానికి చెందిన పిడమర్తి గోపీచంద్ (35) సుతారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కోదాడ పట్టణానికి సుతారీ పనికి వెళ్లి తిరిగి ఆటో లో వస్తుండగా మార్గమధ్యలో ఆటో అదుపుతప్పి డివైడర్ ను డీ కొట్టింది. ఈ ప్రమాదంలో పిడమర్తి గోపీచంద్ దుర్మరణం పాలయ్యారు. మృతుని భార్య పద్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హుజూర్ నగర్ ఎస్ ఐ తెలిపారు.
-----------------------
Admin