సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మే 20 :- ఓబులదేవర చెరువు మండలంలో సమయపాలన లేకుండా రాత్రి, పగలు గంటలు తరబడి విద్యుత్ కోతలతో ఉక్కపోతతో నిద్ర రాక అవస్థలు పడుతున్న పల్లె ప్రజలు. గ్రామాల్లో పగులు, రాత్రి పూట రెండు నుండీ నాలుగు గంటల పాటు విద్యుత్ కోతల కారణంగా గ్రామం ప్రజలు, వ్యవసాయ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని విద్యుత్ బిల్లుల మోత సరిగా విద్యుత్ సరపర చేయలేని స్థితిలో విద్యుత్ శాఖ. వర్షం వస్తే పవర్ కట్ ఎండ కాస్తే పవర్ కట్ వేసవి కాలంలో రాత్రిళ్ళు విద్యుత్ కోతలు లేకుండా అమలు చేయడంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా లేక ఇంకేమైనా కారణమా అంటున్న గ్రామ ప్రజలు. ఓబులదేవర చెరువు మండలంలో సబ్ స్టేషన్ కి ఫోన్ చేయగా కరెంటు పోయిన వెంటనే ఆఫీస్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తున్నారు వారి దగ్గర నుండి సరైన సమాధానం కూడా అందుబాటులో లేదు. విధులు లో లైన్ మాన్ లు, ఆపరేటర్లు, అందుబాటులో లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానిక ప్రజలు గ్రామాలలో చర్చించుకుంటున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండానే రాత్రిళ్ళు విద్యుత్ కోతలు అమలు చేయడం వల్ల పసిపిల్లలు చాలా ఇబ్బందికి గురువుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రజల అవస్థలను గమనించి విద్యుత్ అంతారాయం లేకుండా చూసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
-----------------------
Admin