సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భీంగల్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులను జరిగిన సంఘటన గురించి వివరాలుఅడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి 9:30 గంటలు ప్రాంతంలో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత కలుషిత ఆహారం కారణంగా కొందరు మంది కడుపునొప్పి వాంతులు చేసుకోవడంతో వారని హుటాహుటిన భీంగల్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారని అన్నారు. మెరుగైన వైద్యం కోసం ఒక 103 మంది బాలికలను జిల్లా జనరల్ ఆసుపత్రిలో తరలించారని, ప్రస్తుతం అందరి ఆరోగ్యం పరిస్థితి బాగుందని,ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాలికలందరూ పూర్తిస్థాయిలో కోల్కున్నంత వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని జీజీ హెచ్ సూపరింటెoడెoట్ డాక్టర్ ప్రతిమరాజ్ కు జిల్లా కలెక్టర్ సూచించారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి బాలికలను వివరాలు అడిగి తెలుసుకున్నారు సోమవారం రాత్రి భోజనం అందించిన ఆహార పదార్థాల గురించి ఆరా తీశారు. ఎలాంటి ప్రమాదం లేదని బాలికలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగైన మీదట విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తారని అన్నారు. భీంగల్ కస్తూరిబా విద్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయించామని తెలిపారు. కలుషిత ఆహారం కారణంగా బాలికలు అస్వస్థతకు గోరినట్లు ప్రథమిక నిర్ధారణకు వచ్చామని సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ వి దుర్గ ప్రసాద్ ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్, మెప్మా పీ.డీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin