సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామం నందు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పౌర సరఫరాల శాఖ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికి దేవాలయ విశిష్టతను తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఢిల్లీలో ఈ నెల 28వ తారీఖున ఉన్నందున నల్లగొండ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస పార్టీ సన్నాహక సమావేశం 30 వ తారీఖు కు వాయిదా వేయడం జరిగిందని ఇది అందరూ గమనించ గలరని తెలిపారు కార్యక్రమం 10 AM నుండి 11 AM వరకు - మట్టపల్లి మహా క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో దర్శనము. 11 AM నుండ 01PM వరకు - నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ ముఖ్య నాయకుల సమావేశం 01 PM నుండి 02 PM వరకు భోజన విరామం నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ ఇదే మా ఆహ్వానం గా భావించగలరని జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని తెలిపారు.
-----------------------
Admin