సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఐటీసీ భద్రాచలం ఐడియల్ ఎంప్లాయిస్ యూనియన్, రిజిస్ట్రేషన్ నెంబర్ - ఏ/34 వారి ఆధ్వర్యంలో "ఐడియల్ రంజాన్ కిట్ల" పంపిణీ కార్యక్రమం 20 గురువారం 2023న నిర్వహించడం జరిగింది ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన సారపాక-తాళ్లగుమ్మూరులో గల మస్జిద్ ఏ మరియం - ఈద్గా మస్జిద్ ప్రాంగణం నందు "ఐడియల్ ఎంప్లాయిస్ యూనియన్" ఆధ్వర్యంలో నిరుపేదల సైతం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి అనే ముఖ్యఉద్దేశంతో 50 కుటుంబాలకు ఐడియల్ రంజాన్-ఈద్- కిట్లను పంపిణీ చేశారు ఇస్లాం మూల స్తంభాల్లో ఒకటైన "పేదల ఆర్థిక హక్కు- జకాత్" ద్వారా ప్రతి సంవత్సరం సారపాక చుట్టుపక్కల గ్రామాల్లో నిరుపేద ముస్లిం కుటుంబాలలో రంజాన్ మాసంలో యూనియన్ తరపున ఐడియల్-ఈద్-కిట్లను పంపిణీ చేస్తారు. పరిశ్రమ నందు పనిచేస్తున్న శాశ్వత కార్మికులు మరియు సారపాక పరిసర ప్రాంతాలలో కొందరు ఆప్త మిత్రులు అందరూ కలిసి తమ సంపాదనలో నూటికి రెండున్నర శాతం జకాత్ను పేదల ఆర్థిక హక్కుగా వారికి రంజాన్ కిట్ల రూపంలో చెల్లించడం జరుగుతుంది ఈ పంపిణీ కార్యక్రమంలో నందు ముందుగా షేక్ కాసిం పీరా గారి పదవి విరమణ సన్మాన కార్యక్రమంతో ప్రారంభించి అనంతరం 50 మంది నిరుపేద కుటుంబాలకు ఈద్ కా తోఫా కిట్లను పంపిణీ చేయడం జరిగింది. యూనియన్ జనరల్ సెక్రెటరీ మొహమ్మద్ అబ్దుల్ సాబీర్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుండి చేస్తున్నామని, ఇన్షా అల్లా భవిష్యత్తులో ఇంకా ఈ కిట్ల సంఖ్య పెంచుతామని తెలియజేశారు. యూనియన్ సభ్యులు తో పాటుగా సారపాక నివాసులు కూడా ఐడియల్-ఈద్-కిట్ల పంపిణీ లో భాగస్తులు కావటం చాలా సంతోషంగా ఉందని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు. యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ తాజుద్దీన్ గారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం నందు ప్రతి ముస్లిం విధిగా పేదల ఆర్థిక హక్కు అయిన జకాత్ ను చెల్లించాలని, ఇది ఇస్లాం మూల స్తంభాలలో ఒకటని తెలియజేశారు. అర్హులైన అందరూ విధిగా జకాత్ ఇవ్వటం వల్ల పేదరికం అంతమవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ సలహాదారులు మొహమ్మద్ అబ్దుల్ ఘని( జర్నలిస్ట్) , ఉపాధ్యక్షులు సమ్ షేర్ పాష , యూనియన్ సెక్రటరీ షేక్ ష వలి , మేనేజర్ అబ్దుల్ అలీమ జానాబ్ షేక్ హఫీజ్ , జనాబ్ మొహమ్మద్ ఇసాక్ , జానాబ్ లాల్ మొహమ్మద్ ఖంరున్నిస దంపతుల వారు, ఎస్ ఎన్ కే టి ట్రాన్స్పోర్ట్ సుభాని , డాక్టర్ జమాలుద్దీన్ వారు, ప్లాంటేషన్ ఛాంబర్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ గౌస్ గారు, షేక్ రసూల్ , స్కూల్ ఉపాధ్యాయులు జనాబ్ ఇలియాస్ బక్షి గారు, జనాబ్ జవరుల్లా దావత్ మస్జిద్ అధ్యక్షులు జనాబ్ సయ్యద్ ముహమ్మద్ అలీ ఈద్గా మజీద్ మౌల్వి సయ్యద్ నయీమ్ , జమాత్ అధ్యక్షులు జనాబ్ జహీర్ భాష v v సత్యనారాయణ(Asi) పాల్గొనడం జరిగింది...
-----------------------
Admin