Monday, 27 July 2026 03:24:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ కి సమీక్ష సమావేశం... ముఖ్యఅతిథిగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి.

Date : 04 July 2023 06:44 AM Views : 455

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఆఫీసులో గత రెండు నెలల క్రింద తెలంగాణ ప్రభుత్వము, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏరియాలోని, సబ్ సెంటర్లలో అపాయింట్మెంట్ చేసిన ఎం.ఎల్.హెచ్.పి (అనగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్) డాక్టర్స్ కి షాద్ నగర్ డివిజన్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, వారి యొక్క విధి నిర్వహణ కార్యక్రమాలను తెలియజేశారు. సబ్ సెంటర్ ఏరియాలలో పనిచేస్తున్న ఈ వైద్య అధికారులు గ్రామాలలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సదు ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము 5 వేల పాపులేషన్ గల సబ్ సెంటర్లలో వైద్య అధికారులను నిర్మించారని తెలియచేశారు. అందువలన మీకు కేటాయించిన సబ్ సెంటర్ ఏరియా గ్రామాలలో ఉన్న గర్భవతులకు మెరుగైన సేవలు అందించి వారిని గర్భవతిగా ఉన్నప్పుడు, ఎర్లీగా గుర్తించి రిజిస్ట్రేషన్ చేసి, గర్భవతులకు కావలసిన పరీక్షలు నిర్వహించి, ఏ గర్భవతి అయితే రక్తహీనతకు గురి అయి ఉన్నారో వారిని గుర్తించి, వెంటనే వారికి ఐరన్ పోలిక మాత్రలు ఇచ్చి, ఆ గర్భవతి యొక్క తల్లి బిడ్డల సంరక్షణను చూడవలసిన బాధ్యత ఎం ఎల్ హెచ్ పి వైద్య అధికారులపై ఉంది అని డిప్యూటీ డి ఎం ఎం డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలియజేశారు. గర్భవతులను సమయ ప్రకారముగా రిజిస్ట్రేషన్ చేసి, గర్భవతులకు ఈ మధ్యలనే తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ కిట్లను రెండు విడతలుగా, రెండవ చెకప్ కు, మూడవ చెకప్ కు వచ్చినప్పుడు ఒక నెల వ్యవధితో అందజేయాలని చెప్పారు. గర్భవతికి 9 నెలలు నిండిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుటకు వారికి తగిన సలహాలు, సూచనలు తెలియజేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించి, వారికి తెలంగాణ ప్రభుత్వము ఇస్తున్న కెసిఆర్ కిట్టును అందజేయాలని తెలియచెప్పారు. సంవత్సరంలోని పిల్లలందరికీ కూడా నెల నెల సూదులను రెగ్యులర్గా ఇప్పించి వారికి వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత గ్రామాలలో పనిచేసే ఎం ఎల్ హెచ్ పి వైద్య అధికారులపై ఉంది అని, డాక్టర్ ఎస్ జయలక్ష్మి చెప్పారు. అలాగే గ్రామాలలో ఎవరికైతే మూడు వారాలకు మించి దగ్గు, జ్వరము, సడన్గా బరువు తగ్గి ఉన్నవాళ్లను గుర్తించి వారికి టి.బి స్ఫుటం పరీక్ష చేయించి, వారికి తగిన మందులు ఇవ్వాలని తెలియజేశారు. డివిజన్లోని అందరూ ఎం ఎల్ హెచ్ పి వైద్య అధికారులు సమయపాలన పాటించి, మీ యొక్క వైద్య వృత్తికి న్యాయం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని 17 మంది ఎం ఎల్ హెచ్ పి. వైద్య అధికారులు, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ మెర్లిన్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :