సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పట్టభద్రులు అందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నియోజకవర్గ కోఆర్డినేటర్, పాలకవీడు ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ కోరారు.మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 1 2020 కంటే ముందు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలంటే ఆన్లైన్లో కానీ,ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయంలో ఫామ్ 18 తో ఓటర్ ఐడి (ఎపిక్ నెం), ఆధార్ కార్డ్, పాస్ ఫోటో, డిగ్రీ) డిప్లమో సర్టిఫికేట్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి, సంబంధించిన జిరాక్స్ పత్రాలతో జనరల్ ఓటు హక్కు ఉన్న (సాధారణ ఎన్నికల్లో ఓటరుగా నమోదైన) మండలంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని, గతంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటరుగా నమోదై ఓటుహక్కువినియోగించుకున్నప్పటికీ ఇప్పుడు ఆ ఓటరు జాబితా చెల్లదు కావున అర్హత కలిగిన (గ్రాడ్యుయేషన్ కలిగి ఉండి నియోజకవర్గంలో సాధారణ నివాసియైన) ప్రతి ఒక్కరు తాజాగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా దరఖాస్తుకు ఆఖరు తేదీ 6.02.2024,ఫారం-18 ను గడువు తేదీలోగా సంబంధిత ధృవీకరణ పత్రాలతో సహా మీ ఓటుహక్కు ఉన్న మండల తహశీల్దారు కి సమర్పించాలని కోరారు...
-----------------------
Admin