సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని స్ధానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వము డీలర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తహశీల్దార్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లారు. దిగుమతి కూలి ప్రభుత్వమే భరించాలని, డీలర్లకు బియ్యము తరుగు లేకుండా ఇవ్వాలని, కమిషన్ తో కూడిన గౌరవ వేతనంతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా డీలర్లు ఆకస్మికంగా మరణిస్తే మృతుల కుటుంబాలకు ఇన్సూరెన్స్, డీలర్ షిప్, ప్రభుత్వము తరపున దహన సంస్కార ఖర్చులకు పదివేల రూపాయలు వర్తించేలా చూడాలన్నారు. అనంతరం డీలర్ల సంఘలు వారి అధ్వర్యంలో ఓబులదేవర చెరువు మండల తహశీల్దార్ శ్రీధర్ కు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించినట్లు డీలర్ల సంఘం సత్య సాయి జిల్లా అధ్యక్షులు ఎద్దుల వెంకట రంగారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్రీ పరందామ రెడ్డి, డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎద్దుల వెంకట రంగారెడ్డి ,జిల్లా కోశాధికారి చిదానంద రెడ్డి ,జిల్లా కార్యవర్గ సభ్యులు చిలమత్తూరు రఫీ , మంజునాథ రెడ్డి , ఓబులదేవర చెరువు మండల అధ్యక్షులు మలక అశ్వర్థ రెడ్డి, అమడుగురు అధ్యక్షుడు కొండారెడ్డి , చిన్న జగన్ మోహన్ చౌదరి , రెండు మండలాల డీలర్లు పాల్గొన్నారు...
-----------------------
Admin