Sunday, 26 July 2026 03:39:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం టికెట్ కాంగ్రెస్‌ కే ఇవ్వాలంటు...

Date : 17 October 2023 12:54 AM Views : 353

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరున్నా గెలుపు పక్కా అని అన్ని సర్వేలలో స్పష్టంగా ఉన్నపటికీ పొత్తుల పేరిట టికెట్ సిపిఐ కి ఇస్తామనడం సరైంది కాదంటూ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు వర్గీయులు జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. నిన్న మొన్నటి వరకు‌ తమ పార్టీ అభ్యర్థి నిలుచుంటే భారీ మెజారిటీ దక్కుతుందని అనుకున్నామని కానీ కొత్తగూడెం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు విలువ ఇవ్వకుండా టికెట్ సిపిఐ కు ఇస్తామంటే రేపటి నుండి బయట ఎలా తిరగాలని ప్రశ్నిస్తున్నారు... తామొకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలించి గెలుపు సాధించే స్థానాన్ని కామ్రేడ్‌లతో పొత్తు‌ పేరుతో నియోజక వర్గాన్ని ఇవ్వడాన్ని ఒప్పుకోబోమన్నారు. జనరల్ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గాన్ని‌ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించాడం అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే అంటూ పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదని రెండవ లిస్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెం టికెట్ కాంగ్రెస్ కే కట్టబెట్టాలని.. కామ్రేడ్లు బలంగా ఉన్న నియోజక వర్గాల్లో సిపిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరునూరైనా కొత్తగూడెంను పొత్తులో వదులుకునే ప్రసక్తే లేదని ఖరాఖండిగా అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి, పినపాక ఎల్ డి ఎం కోఆర్డినేటర్ మోతుకూరి ధర్మారావు, కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి గౌసుద్దీన్, గారిపేట ఎంపీటీసీ కసనబోయిన భద్రం, ఓ బి సి జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్,NSUI జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, పాల్వంచ టౌన్ నాయకులు బట్టు మురళి, కాప శ్రీనివాస్, అరిగే గోపి, పాల్వంచ మండల నాయకులు జమ్ముల రాజశేఖర్, కొత్తగూడెం టౌన్ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉస్మాన్ అలీ, పాల్వంచ టౌన్ యోజన కాంగ్రెస్ అధ్యక్షులు హెచ్ మధు, పాల్వంచ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య గిరి ప్రసాద్, లక్ష్మీదేవి పల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బట్టు అరుణ్, కొత్తగూడెం టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి, పాల్వంచ టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పవన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఏలూరి రాందాస్, లక్ష్మణ్, బీరెల్లి భద్రం, గాండ్ల సురేష్, శివ, హర్సింగ్, యువజన నాయకులు కటి సందీప్, షేక్ షాను, మాలిక్ దీపక్, గౌతమ్, హమీద్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: