సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : ఎమ్మెల్యే ఆదిమూలం సారూ..ఒక్కసారి సత్యవేడు -బాలక్రిష్ణాపురం వయా సత్యవేడు శివాలయం రోడ్డును పరిశీలించండి... నాలుగేళ్ళకు పైగా ఈ రోడ్డుకు మరమ్మత్తులు లేవు, నాలుగు దేవాలయాలు, ఒక ఫౌరసరఫరా గిడ్డంగి సముదాయం, నియోజకవర్గ స్థాయి క్రీడా మైదానం, ఓ ప్రయివేట్ జూనియర్ , డిగ్రీ కళాశాల ఉంది. తట్ట మట్టివేసే దిక్కు లేకపోవడంతో అవస్థలు పడుతున్నాం. నాలుగైదు టిప్పర్ లారీల మన్నును ఈ గుంతలకు వేస్తే కాస్త ఊరట వస్తుంది. ఇలాంటి రోడ్డులు ఎన్నో ఉన్నాయి. వాటిని పట్టించుకోక కొందరు ప్రజా ప్రతినిధులు తమిళనాడుకు రోజుకు వేల టన్నుల్లో గులమన్ను అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. దయగల మీరు పరిస్థితులను అర్థం చేసుకుని ఈ రోడ్డు ను సందర్శించి మా రహదారిని దారిద్ర్యపు కష్టాల నుంచి బయటపడేయాలని మిమ్ములను వాహన చోదకులు, రైతులు ,పట్టణ వాసులు , భక్తులు కోరుతున్నారు.
-----------------------
Admin