Monday, 27 July 2026 03:23:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజల కష్టాలు తీర్చేది కాంగ్రెస్ మాత్రమే... - టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు

Date : 19 September 2023 04:32 AM Views : 221

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బంగారు తెలంగాణలోని ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు సమగ్ర ప్రణాళిక చేసిన కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలను ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాల్ రావ్, ఆళ్ళ.మురళి,తూము చౌదరి కొత్తగూడెం మున్సిపాలిటీ 20 వార్డులో ఇంటింటికి వెళ్లి వివరించారు. స్థానిక కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ వారికి కరపత్రాలను అందజేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేద మధ్య తరగతి ప్రజల కష్టాలు పోగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పక్క ప్రణాళిక చేసిందన్నారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించిన నూతన గ్యారెంటీ పథకాల గురించి వివరిస్తూ తెలంగాణలో సొంతిల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం రూ. 5లక్షలు ఆర్థిక సాయంగా అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నామని, చేయూత పథకం ద్వారా వృద్ధుృలు, వితంతువులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ. 4,000 పింఛన్ ఇస్తామన్నారు. పేదలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ. 15,000 చెల్లిస్తామని కౌలు రౌతులకు కూడా దీన్ని వర్తింపజేస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12,000 సాయం అందిస్తామని, వరి పండించే వారికి మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తామని వివరించారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఇక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. యువ వికాసం పథకం ద్వారా విద్యార్థులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరించినట్టు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 6 కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను సామాన్య నిరుపేద ప్రజలకు తప్పకుండా అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, మహేష్, నరేష్, నాగబాబు, సుందర్ లాల్ కోరి, సాయి, కనకరాజు, వెంకటేష్, రవి, బాలప్రసాద్ సత్తి రెడ్డి, వనమా రాము, అయూబ్, సతీష్, ఉదయ్ కుమార్, శేఖర్, సర్వేశ్వర రావు, సురేష్, పండు, నాగేంద్ర, ప్రవీణ్, రాకేష్ మణి, శ్రీకుమార్ యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: