సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : వైద్యం వికటించి ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బాబు ప్రవేటు ఆసుపత్రి లో చోటు చేసుకుంది.బాలుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మఠంపల్లి మండలం బిల్యానాయక్ తండాకు చెందిన బానోతు రమేష్ రెండు సంవత్సరాల చిన్న కుమారుడికి జలుబు, దగ్గు,జ్వరం రావడంతో హాస్పిటల్ తీసుకొనిరావటం జరిగింది.సమయానికి హాస్పిటల్లో డాక్టర్ లేకపోవటంతో అక్కడ ఉన్నటువంటి మహిళ కాంపౌండర్ ట్రీట్మెంట్ చేసి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తరవాత వెంటనే బాలుడు చెమటలు పడుతూ ఉండటంతో ఆ మహిళ కాంపౌండర్ అనుమానంతో వేరొక కాంపౌండర్ కి సమాచారం ఇచ్చారు.ఆయన సమాచారం మేరకు కోదాడ సిద్దార్థ్ హాస్పిటల్ వెళ్ళమని సూచన ఇచ్చారు.అదే సమయంలోనే బాలుడు మృతి చెందాడని బాధితులు తెలిపారు.సిబ్బంది చేసిన వైద్యం వికటించడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని,కుటుంబ సభ్యులు ఊరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ మహిళా సిబ్బంది వల్లనే పిల్లలు చనిపోయారని,ఇప్పుడు మరో బాలుడు చనిపోయాడని స్థానికులు బంధువులు ఆరోపిస్తున్నారు మాకు న్యాయం జరిగేంత వరకు హాస్పిటల్ ముందు ధర్నా చేస్తామని బంధువులు డిమాండ్ చేస్తున్నారు
-----------------------
Admin