సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ వేయాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ తరహాలో పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం గతంలో జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తామని వ్యాఖ్యానించారు. ఈ లెక్కన ప్రస్తుతం 33గా ఉన్న జిల్లాల సంఖ్య దాదాపు తగ్గిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు, మూడు అటూఇటుగా 20 వరకు జిల్లాలు ఏర్పాటు చేయొచ్చని చర్చ జరుగుతున్నది. అంటే కనీసం 13-15 జిల్లాల విలీనం తప్పదన్నమాట. దీంతో కొత్త జిల్లాలు కేంద్రంగా సవ్యంగా సాగుతున్న పాలన మళ్లీ దెబ్బతింటుందన్న ఆందోళన మొదలైంది. ఏ జిల్లా ఉంటుంది? ఏ జిల్లా పోతుంది? అని ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు జిల్లాల సంఖ్యను కుదిస్తే అనేక కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమయం, డబ్బు వృథా అవడంతోపాటు ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలకు నష్టం కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు...
-----------------------
Admin