సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం జరుగనున్న నాలుగో బోనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వరకు తొట్టెలలను ఊరేగింపుగా తెస్తారు. లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. తొట్టెలను తెచ్చే వారికి స్వాగతం పలకడానికి స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తారు. నాలుగో బోనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చేపట్టనున్నామని దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కిరణ్‌ఖరె ప్రభాకర్ తెలిపారు.
-----------------------
Admin