సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : మహిళలపై జరిగే నేరాలను కట్టడి చేయడంతో పాటు ఈ నేరాల్లో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ సూచించారు. ఫోక్సో, తదితర కేసుల్లో అలసత్వం ఉండరాదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లాలోని ఎస్సై ఆ పై స్థాయి పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈఏడాది జరిగిన గ్రేవ్ కేసులు అంతకు మునుపు పెండింగులో ఉన్న యూ... యూ ఐ కేసులు… ఫ్యాక్సన్ సంబంధిత కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులను సర్కిల్ వారీగా సమీక్ష చేశారు.ఈ కేసుల స్థితిగతులు, పురోగతిపై ఆరా తీశారు. ఆయా కేసుల ఛేదింపునకు మెలకువలు, దిశానిర్ధేశం చేశారు. నేర పరిశోధనా అధికారుల పర్ఫామెన్స్ ను కూడా సమీక్షించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిందితుల అరెస్టుల విషయంలో నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలన్నారు. చట్టాలు అనుసరించి మాత్రమే నిందితులను అరెస్టు చేయాలి. ఏమాత్రం అతిక్రమించినా చర్యలు తప్పవు. అక్రమ నిర్బంధం, తదితర చట్ట విరుద్ధమైన పనులు చేయరాదు. నిందితుల అరెస్టు సందర్భంగా తీసుకోవాల్సిన చట్టపరమైన సూచనలు వివరించారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకలిగేలా సిబ్బంది పనితీరు ఉండాలి. అవినీతికి దూరంగా ఉండాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ లను అణచి వేయాలి. జిల్లాలో ఎక్కడా కూడా గుట్కా, అక్రమ మద్యం విక్రయాలు కొనసాగరాదు. ముఖ్యంగా ఇసుక జిల్లా దాటరాదు... కర్నాటక మద్యం జిల్లాలోకి ప్రవేశించరాదు. పోలీసు స్టేషన్లకు వచ్చే స్పందన పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. ప్రజల సమస్యలను విని సత్వరమే పరిష్కరించాలి. ఫ్యాక్సన్ కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఫ్యాక్సనిస్టులు, వారి అనుచరుల కదలికలుపై నిరంతర నిఘా పెట్టాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాల నియంత్రణకు కృషి చేయాలి. ఎస్సీ ఎస్టీ వర్గాలు, మహిళల రక్షణ ముఖ్యంగా భావించాలి. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలుపై ప్రత్యేక నిఘా పెట్టండి. కీలక కేసుల్లో ఘటనా స్థలంలోని ఆధారాలు సక్రమంగా, శాస్త్రీయ పద్ధతులలో సేకరించి దర్యాప్తు సమగ్రంగా చేపట్టాలి. అప్పుడే నిందితులకు శిక్షలు పడే అవకాశముంది. సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలి. రోడ్డు భద్రతపై దృష్టి పెట్టి రోడ్డు ప్రమాదాలు నివారించాలి. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా జిల్లాలో రాత్రి 11 గంటల తర్వాత రోడ్ల పై ఎవరికి అనుమతి లేదని కావున ఎక్కడ కూడా ఏటువంటి ఆ సంఘటిత చర్యలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి రోడ్లపై సంచరించకుండా ఉండేలా చర్యలు తీసుకోండి అని తెలియజేశారు. పోలీసు విధుల్లో పారదర్శకత, అంకితభావం, నిష్పక్షపాతం ముఖ్యం. అప్పుడే పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెరుగుతుంది. పోలీసును ఉద్యోగంగా కాకుండా సేవగా భావించి ప్రజలకు సేవ చేయాలని ఎస్పీ సూచించారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ , పుట్టపర్తి అర్బన్ సీఐ సుబ్బారావు , వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలోని పలువురు డీఎస్పీలు, పలువురు సి.ఐ లు, ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin