సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదకద్రవ్యాల నిర్మూలన భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా గంజాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపి నిరంతరం నిఘా లో భాగంగా ఈరోజు మిర్యాలగూడలో ఉదయం 8 గంటలకు ఒక వ్యక్తి చేతిలో సంచి తో నడుచుకుంటూ మిర్యాలగూడ బోటింగ్ శివాలయం దగ్గరికి వచ్చి గంజాయి అమ్ముతారని మిర్యాలగూడ వన్ టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్ కు నమ్మదగిన సమాచారం రాగ ఎస్ఐ సిబ్బంది తోటి శివాలయం బోటింగ్ దగ్గరికి వెళ్లగా ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఒకరికి చేతిలో సంచి తో అక్కడికి వచ్చి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పారిపోగా పోలీసులు వారు వెంబడించి అతని పట్టుబడి చేయడమైనది నిందితుని వివరాలు సిరికొండ భాను ప్రకాష్ శాంతినగర్ మిర్యాలగూడ పట్టణం చెందిన వారిగా గుర్తించారు. నిందితుని దగ్గర 1300 గ్రాముల ఎండు గంజాయి ఒక మొబైల్ ఫోన్ 2000 నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు వివరాలు భాను ప్రకాష్ తండ్రి 8 సంవత్సరాల క్రితం చనిపోగా అప్పటినుండి చెడు వ్యాసనాలకు బానిసై కోదాడ చెందిన అఖిల్ సోను మరియు డేంజర్ రాఘవులు గంజాయి అలవాటు పడినాడు వీరి ముగ్గురు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ లోని కురుమనూరు గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర 1. 1/2 కేజీల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ దూల్పేట్ పటాన్ చెరువు గీతం కాలేజీ దగ్గర ఇబ్రహీంపట్నం సిద్ధార్థ్ కాలేజ్ దగ్గర మిర్యాలగూడ లో కొంతమంది వ్యక్తుల దగ్గర అమ్మగా లాభం రావడంతో కష్టపడకుండా ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో మరలా నవంబర్ 2024లో భద్రాచలం వెళ్లి అక్కడ నుండి చింతూరు కుంట గ్రామం అక్కడి నుంచి సుమారు 75 కిలోమీటర్ దూరంలో గల కురుమనూరు గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర రెండున్నర కేజీల గంజాయి 5000 కొనుగోలు చేసి 50 గ్రాములు చొప్పున ప్యాకెట్ చేసి అమ్ముతున్నాడు. బుధవారం రోజున సుమారు 1300 గ్రామ్స్ గంజాయి మిర్యాలగూడ టౌన్ లో అతడు ఇదివరకు అమ్మిన నలుగురు వ్యక్తులకు అమ్మి మిగతాది హైదరాబాద్ వెళ్లి అమ్ముదామని కోదాడలో లారీ కి వచ్చి ఈదులగూడెం సెంటర్లో దిగి అక్కడి నుంచి ఆట ఎక్కి తడకముల క్రాస్ రోడ్ వద్ద దిగి అక్కడినుంచి శివాలయం బోటింగ్ దగ్గరకు వస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు ఇట్టి కేసును చేదించిన మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ ఎస్ఐ సుధీర్ కుమార్ కానిస్టేబుల్స్ ను డిఎస్పి రాజశేఖర్ అభినందించారు...
-----------------------
Admin