సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఉన్నత అధికారులుగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. బి ఆదిలక్ష్మి విద్యా శాఖ మంత్రిగా, దివ్య జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎం నందిని జిల్లా కలెక్టర్ గా, జిల్లా విద్యాధికారి గా అక్షిత ప్రధాన ఉపాధ్యాయులుగా ఎస్ కె కరిష్మా నిర్వహించారు. ఇంకా వివిధ విషయాలను బోధించుటకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రావు అధ్యక్షత వహించి ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిగమించాలని విద్యార్థులను దీవించారు
-----------------------
Admin